సంక్షేమ పథకాలు అమలు చేయడం లో టీడీపీ ఘోరంగా విఫలమైందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముంజేటి కృష్ణమూర్తి విమర్శించారు.
‘సంక్షేమ పథకాల అమల్లో సర్కారు విఫలం’
Jul 19 2016 10:26 PM | Updated on Sep 4 2017 5:19 AM
శ్రీకాకుళం అర్బన్: సంక్షేమ పథకాలు అమలు చేయడం లో టీడీపీ ఘోరంగా విఫలమైందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముంజేటి కృష్ణమూర్తి విమర్శించారు. ఆయన మంగళవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రెండున్నరేళ్లలో ఒక్క బ్యాక్‌లాగ్ పోస్టునూ భర్తీ చేయలేదని తెలిపారు. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేందుకే ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లను మూసివేస్తున్నారని మండిపడ్డారు. గ్రామాల్లో చెరువు గర్భంలో ఉన్న డి–పట్టా భూములను ఎస్సీలకు ఇచ్చారని, ఈ భూములను నీరు–చెట్టు పేరుతో టీడీపీ నేతలు ఆక్రమించుకోవడం దారుణమన్నారు. ఇటీవల ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ జిల్లాకు వచ్చి అర్హులైన ఎస్సీలకు కార్పోరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారని, ఇందులో ఎంతమంది ఎస్సీలకు రుణాలు మంజూరు చేసి లబ్ధి చేకూర్చారో చెప్పాలన్నారు. బినామీ పేర్లతో పచ్చచొక్కాల వారికే రుణాలు మంజూరు చేస్తున్నారని ఆరోపించారు.
Advertisement
Advertisement