తత్కాల్ ప్రయాణికులకు శుభవార్త | good news for tatkal travelers | Sakshi
Sakshi News home page

తత్కాల్ ప్రయాణికులకు శుభవార్త

Jul 26 2015 10:46 AM | Updated on Sep 3 2017 6:13 AM

తత్కాల్ ప్రయాణికులకు శుభవార్త

తత్కాల్ ప్రయాణికులకు శుభవార్త

తత్కాల్ టిక్కెట్ ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త ప్రకటించింది.

వరంగల్(కాజీపేట): తత్కాల్ టిక్కెట్ ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త ప్రకటించింది.  గతంలో తత్కాల్ టిక్కెట్లు తీసుకునే వారు టిక్కెట్ రిజర్వేషన్ కౌంటర్‌లోనూ, రైలు ప్రయాణంలోనూ టీసీకి గుర్తింపు కార్డు జిరాక్స్ ఇవ్వాల్సి ఉండేది. ఈ నిబంధనల ప్రకారం లేకుంటే వారికి టీసీలు జరిమానా విధించేవారు.

అయితే సెప్టెంబర్ 1వతేదీ నుంచి రైల్వే శాఖ తత్కాల్ టిక్కెట్‌లు తీసుకునే వారికి తమ గుర్తింపు కార్డు ఇవ్వాల్సిగాని, చూపించాల్సిన అవసరంగానీ లేదని రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు శనివారం స్థానిక రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా  ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement