స్వర్ణోత్సవ వైభవం | Golden glory arts venues in ravindra bharathi | Sakshi
Sakshi News home page

స్వర్ణోత్సవ వైభవం

Aug 30 2016 10:01 PM | Updated on Sep 4 2018 5:21 PM

స్వర్ణోత్సవ వైభవం - Sakshi

స్వర్ణోత్సవ వైభవం

నగరంలోని రవీంద్రభారతి ప్రాంగణంలో గల ఘంటసాల వేదికపై ‘కళావేదిక స్వరో్ణత్సవ వైభవం’ ఘనంగా జరిగింది.

సాక్షి,సిటీబ్యూరో: నగరంలోని రవీంద్రభారతి ప్రాంగణంలో గల ఘంటసాల వేదికపై ‘కళావేదిక స్వర్ణోత్సవ వైభవం’ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మోహనకృష్ణ మిమిక్రీ ఆకట్టుకుంది. జంగయ్య గౌడ్‌ పౌరాణిక పద్యాలతో అలరించారు. వెంకటప్ప బృందం తోలుబొమ్మలాటను ప్రేక్షకులు ఆసక్తిగా తిలకించారు. వేణుమాధవ్‌ శాస్త్రీయ సంగీతం రమణీయంగా సాగింది.

సంకల్ప ఆర్ట్స్‌ థియేటర్‌ ప్రదర్శించిన యేటికొప్పాక బొమ్మల ప్రదర్శన ముచ్చటగొల్పింది. కళావేదిక నిర్వాహకురాలు ఆర్‌వీ భువను వివిధ రంగాల ప్రముఖులు అభినందించారు. వేదిక వ్యవస్థాపకులు దివంగత ఆర్‌వీ రమణమూర్తి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌బీసీఎల్‌ ఎమ్‌డీ ఆర్‌.వి.చంద్రవదన్, శర్మ తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement