‘గాడ్‌’ దంపతులకు పుష్పార్చన | god counples pushparchana | Sakshi
Sakshi News home page

‘గాడ్‌’ దంపతులకు పుష్పార్చన

Jan 22 2017 10:28 PM | Updated on Sep 5 2017 1:51 AM

మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో ఆదివారం పీఠాధిపతి వాడ్రేవు వెంకటసుబ్రహ్మణ్యం(గాడ్‌) దంపతులకు భక్తులు పుష్పార్చన నిర్వహించారు. గాడ్‌ జన్మ నక్షత్రం ప్రకారం బుధవారం పుట్టిన రోజును భక్తులు చేశారు. కుటుంబ సభ్యులతో పాటు వివిధ

వెదురుపాక (రాయవరం) : 
మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో ఆదివారం పీఠాధిపతి వాడ్రేవు వెంకటసుబ్రహ్మణ్యం(గాడ్‌) దంపతులకు భక్తులు పుష్పార్చన నిర్వహించారు. గాడ్‌ జన్మ నక్షత్రం ప్రకారం బుధవారం పుట్టిన రోజును భక్తులు చేశారు. కుటుంబ సభ్యులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గాడ్‌కు ఆయన సతీమణి సీతమ్మకు పుట్టిన రోజు వేడుకగా జరిపారు. గాడ్‌ దంపతులకు పలువురు భక్తులు గజమాలలు వేశారు. అదేవిధంగా గాడ్‌ దంపతులకు భక్తులు పుష్పార్చన, పాద పూజ నిర్వహించి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. భక్తులకు గాడ్‌ ఆశీస్సులు అందజేశారు. పలువురు భక్తులు పీఠంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. గాడ్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని పీఠంలో కొలువైన విజయదుర్గా అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. పీఠం పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్‌(బాబి) ఆధ్వర్యంలో భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement