breaking news
pushparchana
-
యాదాద్రిలో త్వరలో కోటి పుష్పార్చన వేడుక
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో త్వరలోనే మరో అద్భుతమైన వేడుకలను నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధానా ర్చకులు నల్లంథీగల్ లక్ష్మీనరసింహాచార్యులు వెల్లడించారు. శుక్రవారం ఆయన ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో మాట్లాడుతూ త్వరలోనే ఆలయంలో కోటి పుష్పార్చన వేడుకను జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే వేడుక తేదీలను ప్రకటిస్తామన్నారు. అంతే కాకుండా కోటి పుష్పార్చన వేడుక ముగిసిన వెంటనే వేయి యజ్ఞ గుండాలతో లోక కల్యాణార్థమైన లక్ష్మీనరసింహ సహస్ర కుండాత్మక మహాయాగం నిర్వహించేందుకు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. -
‘గాడ్’ దంపతులకు పుష్పార్చన
వెదురుపాక (రాయవరం) : మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో ఆదివారం పీఠాధిపతి వాడ్రేవు వెంకటసుబ్రహ్మణ్యం(గాడ్) దంపతులకు భక్తులు పుష్పార్చన నిర్వహించారు. గాడ్ జన్మ నక్షత్రం ప్రకారం బుధవారం పుట్టిన రోజును భక్తులు చేశారు. కుటుంబ సభ్యులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గాడ్‌కు ఆయన సతీమణి సీతమ్మకు పుట్టిన రోజు వేడుకగా జరిపారు. గాడ్ దంపతులకు పలువురు భక్తులు గజమాలలు వేశారు. అదేవిధంగా గాడ్ దంపతులకు భక్తులు పుష్పార్చన, పాద పూజ నిర్వహించి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. భక్తులకు గాడ్ ఆశీస్సులు అందజేశారు. పలువురు భక్తులు పీఠంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. గాడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని పీఠంలో కొలువైన విజయదుర్గా అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. పీఠం పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్(బాబి) ఆధ్వర్యంలో భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు.