ధర్మవరం రైల్వేస్టేషన్‌లో తప్పిపోయిన చిన్నారి అంజలిని వైఎస్సార్‌సీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కత్తే పెద్దన్న సాయంతో ఓ యువకుడు శుక్రవారం రాత్రి పట్టణ పోలీసులకు అప్పగించారు.
బాలసదన్‌కు బాలిక అప్పగింత
Oct 15 2016 11:52 PM | Updated on Sep 4 2017 5:19 PM
ధర్మవరం అర్బన్: ధర్మవరం రైల్వేస్టేషన్‌లో తప్పిపోయిన చిన్నారి అంజలిని వైఎస్సార్‌సీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కత్తే పెద్దన్న సాయంతో ఓ యువకుడు శుక్రవారం రాత్రి పట్టణ పోలీసులకు అప్పగించారు. పోలీసులు తప్పిపోయిన బాలికను విచారించగా తన పేరు అంజలి అని చెబుతోంది. బాలిక పూర్తి వివరాలు తెలియకపోవడంతో పోలీసుల సాయంతో వైఎస్సార్‌సీపీ నాయకుడు పెద్దన్న పట్టణంలోని బాలసదన్ వసతి గృహంలో బాలికను శుక్రవారం రాత్రి 11గంటలకు అప్పగించాడు. అనంతరం ఉదయం ఆ బాలికను అనంతపురం హోంకేర్‌కు పంపినట్లు తెలిపారు.
Advertisement
Advertisement