చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం.. హత్య | Girl raped by neighbour in Kopparthi | Sakshi
Sakshi News home page

చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం.. హత్య

Mar 10 2016 5:34 PM | Updated on Sep 3 2017 7:26 PM

చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం.. హత్య

చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం.. హత్య

ఇంటి వద్ద ఆడుకుంటున్న అభం శుభం తెలియని ఓ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా దారుణంగా హత్య చేశాడో కీచకుడు.

వైఎస్‌ఆర్‌ జిల్లా: ఇంటి వద్ద ఆడుకుంటున్న అభం శుభం తెలియని ఓ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా దారుణంగా హత్య చేశాడో కీచకుడు. ఈ ఘటన వైఎస్‌ఆర్‌ జిల్లాలోని చింతకొమ్మదిన్నె మండలం కొప్పర్తిలో గురువారం వెలుగుచూసింది. చిన్నారిపై కన్నేసిన ఓ కామాంధుడు ఇంటివద్ద ఆడుకుంటుండగా బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి ఆపై హత్యచేసి పాతిపెట్టాడు. గమనించిన కీచకుడి భార్య పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తమదైన శైలీలో నిందితుడిని ప్రశ్నించడంతో చిన్నారిని పాతిపెట్టిన స్థలాన్ని చూపించాడు. చిన్నారి మృతదేహాన్ని వెలికితీసిన అనంతరం స్థానికులు ఆగ్రహంతో కీచకుడిపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement