breaking news
villagers angrey
-
ఇక్కడ పెళ్లిళ్లు వద్దే వద్దు.. ఏకమైన గ్రామస్తులు..!
వివాహాలు లేదా పలు వేడుకలను మంచి ప్రదేశాల్లో సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది సర్వ సాధారణం. ఐతే మరికొంతమంది పచ్చదనం పరుచుకున్న ప్రదేశాల్లో ఆహ్లాదంగా ఇలాంటి వేడుకులను జరుపుకునేందుకు ఇష్టపడతారు. అలానే యూకేలో ఒక ఆక్స్‌నీడ్ హాల్ అనే గ్రాండ్ ఎస్టేట్ ఇలాంటి వేడుకలకు పెట్టింది పేరు. బ్రిటన్‌లోని చాలా మంది ధనవంతుల కుటుంబాలు ఈ ప్రదేశంలోనే పెళ్లిళు, పార్టీలు వంటి వేడుకలను చేసుకుంటారు. అదీగాక ఈ మహమ్మారి సమయంలో ఈ ప్రదేశంలో ఈ వివాహ వేడుకలు, పార్టీలు మరింత అధికమయ్యాయి. అంతకుముందు ఉన్నత స్థాయి కుటుంబాలకు మాత్రమే అనుమతిచ్చేవారు. అయితే ఈ వేడుకలు అక్కడ ఉండే స్థానికులను ఇబ్బందులకు గురి చేశాయి. దీంతో అక్కడ ఉండే గ్రామస్తులంతా ఈ గార్డెన్‌లోకి వధువరులకు ఎంట్రీ లేదు, ఇక్కడ వివాహలు చేసుకునేందుకు అనుమతి లేదు అనే బోర్డులు పెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. బ్రిటన్‌లో ఈ ఎస్టేట్ 16వ శతాబ్ద కాలంనాటి చారిత్రక ఎస్టేట్‌గా పేరుగాంచింది. ఐతే వివాహానికి విచ్చేసిన అతిధులు ఆ వెడ్డింగ్ హాల్ గ్రాండ్ ఎస్టేట్ చుట్టూ ఉన్న 500 ఎకరాల పోలాలను నాశనం చేస్తున్నారు. పైగా విపరీతమై మ్యూజిక్ పెట్టి చుట్టుపక్కలవాళ్లను ఇబ్బందులకు గురిచేయడంతో అక్కడ ఉండే గ్రామస్తులంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వధువరులకు, జంటలకు ఆహ్వానం లేదు అని ఆ ఎస్టేట్ ముందు బోర్డులు పెట్టారు. (చదవండి: ఛేజింగ్ సమయంలో అనుహ్య ఘటన.... మంటల్లో చిక్కుక్కున్న వాహనదారుడు) -
చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం.. హత్య
వైఎస్ఆర్ జిల్లా: ఇంటి వద్ద ఆడుకుంటున్న అభం శుభం తెలియని ఓ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా దారుణంగా హత్య చేశాడో కీచకుడు. ఈ ఘటన వైఎస్ఆర్ జిల్లాలోని చింతకొమ్మదిన్నె మండలం కొప్పర్తిలో గురువారం వెలుగుచూసింది. చిన్నారిపై కన్నేసిన ఓ కామాంధుడు ఇంటివద్ద ఆడుకుంటుండగా బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి ఆపై హత్యచేసి పాతిపెట్టాడు. గమనించిన కీచకుడి భార్య పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలీలో నిందితుడిని ప్రశ్నించడంతో చిన్నారిని పాతిపెట్టిన స్థలాన్ని చూపించాడు. చిన్నారి మృతదేహాన్ని వెలికితీసిన అనంతరం స్థానికులు ఆగ్రహంతో కీచకుడిపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.