
వనపర్తిలో బురఖా ధరించిన బాలికతో బైకుపై వెళ్తున్నట్లు సీసీ కెమెరాలో రికార్డు
బాలిక హత్యకేసు మిస్టరీ వీడడం లేదు. ఘటన జరిగి ఐదు రోజులు గడిచినా పురోగతి లేదు.
ఆ సమయంలో చీకటిగా ఉండడంతో గుర్తుపట్టడం కష్టసాధ్యంగా మారింది. అయితే బైకుకు దుస్తులు వేలాడుతున్నట్లు కనిపిస్తుడడంతో అనుమానం రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఐదురోజులు అవుతోంది. శవం నుంచి దుర్వాసన వస్తుంది. ఆచూకీ కోసం బాలిక శవాన్ని వనపర్తి ఏరియా ఆస్పత్రి పోస్టుమార్టం గదిలో ఉంచారు. ఏవైనా వివరాలు లభిస్తాయోనని పోలీసులు వేచి చూస్తున్నారు. దీనిపై ఎస్‌ఐ సైదులును వివరణ కోరగా..ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ఆచూకీ లభించలేదన్నారు. అన్నికోణాల్లో పరిశీలిస్తున్నట్లు చెప్పారు. గురువారం మృతదేహాన్ని ఖననం చేసే అవకాశం ఉందని చెప్పారు.