సెల్‌ఫోన్ పేరుతో ఘరానా మోసం | fraud in nellore over online mobile purchase | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్ పేరుతో ఘరానా మోసం

Jul 16 2016 6:06 PM | Updated on Oct 20 2018 6:19 PM

తక్కువ ధరకే విలువైన సెల్‌ఫోన్ ఇస్తామని ఓ సంస్ధ ఒక యువకుడిని మోసం చేసింది.

కొరుటూరు (ఇందుకూరుపేట) : తక్కువ ధరకే విలువైన సెల్‌ఫోన్ ఇస్తామని ఓ సంస్ధ ఒక యువకుడిని మోసం చేసింది. మండలంలోని కొరుటూరుకు చెందిన షేక్ దావూద్‌కు ఓ మహిళ ఫోన్ చేసి తాము ఎస్‌ఎస్ లైఫ్ కేర్ నుంచి మాట్లాడుతున్నామని, కంపెనీ ఆఫర్ మీద రూ.3,500 చెల్లిస్తే రూ.15 వేల విలువ చేసే సెల్‌ఫోన్ మీ ఇంటికే పోస్టుద్వారా పంపుతామని నమ్మబలికింది.

దీంతో నమ్మిన దావూద్ అందుకు అంగీకరించి సెల్‌ఫోన్ పంపాలని తన చిరునామా ఇచ్చి కోరారు. శుక్రవారం పోస్ట్‌లో ఇంటికి వచ్చిన పార్శిల్‌కు రూ.3,500 చెల్లించి తీసుకున్నాడు. తీరా పార్శిల్ బాక్సును విప్పి చూడగా అందులో సేవింగ్ రీజర్, లైట్ ఇండికేటర్, బాడీ క్రీం మాత్రమే ఉన్నాయి. కనీసం మూడు వందల రూపాయలు కూడా విలువ చేయని ఈ సామాన్లు చూసి నివ్వెర పోయాడు. ఇదేమిటని తనకు ఫోన్ వచ్చిన 88850 41759 నంబరు కాల్ చేయగా హేళనగా మాట్లాడంతో పాటు తమిళం, హిందీ భాషల్లో ఆట పట్టించారని వాపోయాడు. తనకు వచ్చిన పార్శిల్ అడ్రస్ చూడగా ఎస్‌ఎస్ లైఫ్‌కేర్, నం 300 కాంజేయ్నల్లూరు రోడ్, గాంధీనగర్, వెల్లూరు-632006, కాట్పాడి, తమిళనాడు అని ఉందని, తాము మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement