అక్రమ కేసుల్ని సహించం | Sakshi
Sakshi News home page

అక్రమ కేసుల్ని సహించం

Published Fri, Nov 4 2016 2:40 AM

అక్రమ కేసుల్ని సహించం - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తే సహించేది లేదని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెంలో ఫ్లెక్సీ ఏర్పాటు సందర్భంగా తలెత్తిన చిన్నపాటి వివాదాన్ని అడ్డం పెట్టుకుని మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ  అట్రాసిటీ కేసులు పెట్టేందుకు అధికార పార్టీ యత్నిస్తున్న నేపథ్యంలో వైఎస్సా ర్‌ సీపీ నాయకుల బృందం జిల్లా ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌ను గురువారం ఆయన కార్యాలయానికి వెళ్లి కలిసింది. బృందంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, పార్టీ ఉంగుటూరు సమన్వయకర్త పుప్పాల వాసుబాబు తదితరులు ఉన్నారు. ఫ్లెక్సీ ఏర్పాటు విషయమై చోటుచేసుకున్న ఘర్షణ విషయంలో ప్రతిపక్షంపై కక్షగట్టినట్టు వ్యవహరించడం సరికాదని వారు ఎస్పీకి వివరించారు. ఘటన జరిగిన సమయంలో అక్కడలేని వ్యక్తితో ఫిర్యాదు చేయించి ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయడాన్ని ఎస్పీకి వివరిం చారు. అక్కడ పోలీసులకు సంబంధించిన సీసీ కెమేరాలు ఉన్నాయని, ఘటనను పూర్తిగా పరిశీలించి నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. మంత్రి మాణిక్యాలరావు డీఎస్పీ సమక్షంలో సీఐని అసభ్య పదజాలంతో దూషించిన వీడియో అందచేశారు. 
 
ఇంత దారుణమా
అనంతరం ఆళ్ల నాని మాట్లాడుతూ చిన్న వివాదాన్ని అడ్డం పెట్టుకుని హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు.అధికార పార్టీ ఆగడాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ ఘటనను చూస్తే అర్థం అవుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యేపైనే అక్రమ కేసులు పెట్టడానికి సిద్ధపడితే సామాన్యుడి పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని నేతలు గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. మంత్రి పైడికొండల మాణిక్యాలరావు హోదాను మరిచి చిన్న వివాదంలో తలదూర్చి మాజీ ఎమ్మెల్యే కొట్టుపై అక్రమంగా హత్యాయత్నం కేసు బనాయిం చడం దారుణమన్నారు. కొట్టు సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యులపై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. నిష్పక్షపాతంగా విచారణ చేసి చర్యలు తీసుకోవాలని, రాజకీయ ఒత్తిళ్లకు లొంగవద్దని పోలీసు శాఖను కోరామన్నారు. టీడీపీ, బీజేపీ నేతలు పద్ధతి మార్చుకోకుంటే తగిన మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు. ఈ విషయాన్ని పార్టీ అధినేత వైఎస్‌జగ¯ŒSమోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతోపాటు న్యాయపరమైన పోరాటం చేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ చిన్న ఘటనను అడ్డం పెట్టుకుని అక్రమ కేసులు బనాయిస్తే భయపడి పారిపోయేది లేదన్నారు. అధికార పార్టీ ఆగడాలను ఎదుర్కొంటామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టిన వ్యక్తి ఘటనా స్థలంలోనే లేడని, చిన్నపాటి ఘటనను 307, ఎస్సీ, ఎస్టీ సెక్షన్ల వరకూ తీసుకువెళ్లారన్నారు. ఇలా అరాచకాలు చేసిన వారు చరిత్రలో చాలామంది గతించిపోయారని ఆయన గుర్తు చేశారు. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ  వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్న ఘటనలపై ప్రతిపక్షాలు ఫిర్యాదు చేస్తే పోలీస్‌ యంత్రాంగం స్పందించడం లేదని, అధికార పార్టీ కేసు పెడితే మాత్రం క్షణాల్లో స్పందిస్తోందని అన్నారు. అధికార పార్టీకి పోలీసులు వత్తాసు పలడం దురదృష్టకరమన్నారు.  
 

Advertisement
Advertisement