గోదాంల నిర్మాణానికి శంకుస్థాపన | foundation stone for wherehouse | Sakshi
Sakshi News home page

గోదాంల నిర్మాణానికి శంకుస్థాపన

Aug 6 2016 5:58 PM | Updated on Sep 4 2017 8:09 AM

గోదాంల నిర్మాణానికి శంకుస్థాపన

గోదాంల నిర్మాణానికి శంకుస్థాపన

మండల పరిధిలోని వాయిలసింగారంలో నిర్మించనున్న వ్యవసాయ గోదాం నిర్మాణపు పనులకు టాస్కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు శనివారం శంకుస్థాపన చేశారు.

వాయిలసింగారం(నడిగూడెం): మండల పరిధిలోని వాయిలసింగారంలో నిర్మించనున్న వ్యవసాయ గోదాం నిర్మాణపు పనులకు టాస్కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో  సర్పంచ్‌ వెంపటి రూప వెంకటేశ్వరరావు, జిల్లా సహకార సంఘం చైర్మన్‌ ముత్తవరపు పాండు రంగారావు, తెల్లబెల్లి సింగిల్‌విండో చైర్మన్‌ చుండూరు వెంకటేశ్వరరావు, సీఈఓ దేవబత్తిని శ్రీనివాసరావు, పాలకమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement