
హైదరాబాద్: ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ స్వచ్ఛంద సంస్థ అయిన ఫ్లిప్‌కార్ట్ ఫౌండేషన్, స్మైల్ ఫౌండేషన్ సహకారంతో, ఇటీవల ఆదిలాబాద్ (తెలంగాణ), బెంగళూరు, ముంబైలలోని పేద వర్గాలకు సాధికారత కల్పించే కార్యక్రమాన్ని పూర్తి చేసింది. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, రుతుక్రమ పరిశుభ్రత విద్య, ఆర్థిక అక్షరాస్యత శిక్షణపై దృష్టి సారించిన ఈ ప్రాజెక్ట్ ఈ సంవత్సరం ప్రారంభంలో మొదలైంది.
ఫ్లిప్‌కార్ట్ ఫౌండేషన్ సేవా కార్యక్రమం ద్వారా 9,700 మందికి పైగా ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరింది. మరో 26,000 మందికి పైగా సాకుకూల ప్రభావం కలిగింది. ఈ కార్యక్రమంలో వైద్య సంప్రదింపులు, వ్యాధులపై అవగాహన సెషన్లు, రోగ నిర్ధారణ పరీక్షలు, ఉచిత మందులు అందించే సమగ్ర ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. కౌమారదశలో ఉన్న బాలికలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ రక్తహీనత పరీక్షలు, రుతుక్రమ పరిశుభ్రత వర్క్‌షాప్‌లు, శానిటరీ ఉత్పత్తుల పంపిణీ వంటివి చేపట్టారు. అలాగే టీనేజర్లకు ఆర్థిక అక్షరాస్యత తరగతులు నిర్వహించారు.
“ప్రజలు సమగ్ర జ్ఞానం, అవసరమైన వనరులతో సాధికారత పొందినప్పుడు స్థిరమైన మార్పు పుడుతుందని మేము గట్టిగా విశ్వసిస్తున్నాం” అని ఫ్లిప్‌కార్ట్ కార్పొరేట్ వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్ సారా గిడియన్ అన్నారు. “సమగ్ర అభివృద్ధి అనేది పేద వర్గాలు పురోగతి చెందినప్పుడే సాధ్యమవుతుంది” అని స్మైల్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ సంతను మిశ్రా అభిప్రాయపడ్డారు.