మాజీ మావోయిస్టు ఆత్మహత్యాయత్నం | former Maoist commit to suicide | Sakshi
Sakshi News home page

మాజీ మావోయిస్టు ఆత్మహత్యాయత్నం

Feb 26 2016 3:42 AM | Updated on Sep 3 2017 6:25 PM

మాజీ మావోయిస్టు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బి.వెల్లెంలకు చెందిన బొప్పని రామకృష్ణ మావోయిస్టు పార్టీలో పనిచేసి

నల్లగొండ క్రైం: మాజీ మావోయిస్టు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బి.వెల్లెంలకు చెందిన బొప్పని రామకృష్ణ మావోయిస్టు పార్టీలో పనిచేసి, కొన్నేళ్ల క్రితం జనజీవనస్రవంతిలో కలిశాడు. కొంతకాలంగా నల్లగొండలో నివాసముంటున్నాడు. బుధవారం నిద్రమాత్రలు మింగి అపస్మారకస్థితిలో పడి ఉండడంతో కుటుంబ సభ్యులు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హత్యకు సుపారీ తీసుకున్నట్లు రామకృష్ణ పేరుతో మీడియా, పోలీసులకు గతంలో లేఖలు అందాయి. తాను సుపారీ తీసుకోలేదని, ఈ కుట్రతో తనకు సంబంధం లేదని రామకృష్ణ తన సన్నిహితుల వద్ద అన్నట్లు సమాచారం. లేఖపై విచారణ చేస్తున్న పోలీసులు ఎవరి పేరునూ ఇంత వరకు ప్రకటించలేదు. పోలీసు అధికారులు రామకృష్ణ వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement