ఫ్లోఫుట్‌బాల్‌ మ్యాచ్‌ విజేత నరసాపురం | flow football winner in narasapuram | Sakshi
Sakshi News home page

ఫ్లోఫుట్‌బాల్‌ మ్యాచ్‌ విజేత నరసాపురం

Jan 6 2017 10:26 PM | Updated on Sep 5 2017 12:35 AM

ఫ్లోఫుట్‌బాల్‌ మ్యాచ్‌ విజేత నరసాపురం

ఫ్లోఫుట్‌బాల్‌ మ్యాచ్‌ విజేత నరసాపురం

తణుకు టౌన్‌ : కోటగిరి విద్యాధరరావు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఫ్లోఫుట్‌బాల్‌ టోర్నమెంటులో భాగంగా శుక్రవారం స్థానిక చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో తణుకు–నరసాపురం జట్ల మధ్య పోటీ జరిగింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో 2–1 గోల్‌ తేడాతో నరసాపురం విజయం సాధించినట్లు ఫ్లో సీఈవో రాజేష్‌ రావూరి తెలిపారు.

తణుకు టౌన్‌ : కోటగిరి విద్యాధరరావు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఫ్లోఫుట్‌బాల్‌ టోర్నమెంటులో భాగంగా శుక్రవారం స్థానిక చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో తణుకు–నరసాపురం జట్ల మధ్య పోటీ జరిగింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో  2–1 గోల్‌ తేడాతో నరసాపురం విజయం సాధించినట్లు ఫ్లో సీఈవో రాజేష్‌ రావూరి తెలిపారు. తొలుత  ఈ మ్యాచ్‌ను మాజీ ఎమ్మెల్యే చిట్టూరి వెంకటేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ నాయకుడు కడియాల సూర్యనారాయణ  ప్రారంభించారు. శ్యామ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచారు. ఈ సందర్భంగా లావా మొబైల్‌ సంస్థ నిర్వహించిన లక్కీడిప్‌లో జి. ఏసురాజు మొబైల్‌ ఫోన్‌ గెలుచుకున్నారు.  మ్యాచ్‌ కో-ఆర్డినేటర్‌ డి. రంగారావు, కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.శ్యాంబాబు,  వైఎస్సార్‌ సీపీ పట్టణ అధ్యక్షుడు ములగాల శ్రీనివాస్, వైఎస్సార్‌ సీపీ ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు కౌరు వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ ఆకులు వెంకటేశ్వరరావు, వైఎస్‌ సేవాదళ్‌ నాయకుడు అంబటి రాఘవ, లావా మొబైల్‌ ప్రతినిధులు, లయన్స్‌ క్లబ్‌ సభ్యులు, విద్యార్థులు మ్యాచ్‌ను తిలకించారు. 
 
ఫొటోరైటప్‌: 06టీఎన్‌కెసియూఎల్‌ 06– హోరాహోరీగా తలపడుతున్న నరసాపురం, తణుకు జట్లు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement