సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభం | Flamingo festival starts at sullurpet | Sakshi
Sakshi News home page

సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభం

Jan 9 2016 11:21 AM | Updated on Oct 20 2018 6:04 PM

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ శనివారం ప్రారంభమైంది.

నెల్లూరు : నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ శనివారం ప్రారంభమైంది. ఈ ఫెస్టివల్ను రాష్ట్ర మంత్రులు పి. నారాయణ, శిద్దా రాఘవరావు ప్రారంభించారు. ఈ ఫెస్టివల్ నేటి నుంచి రెండు రోజుల పాటు జరగనుంది. అయితే ఈ ఫెస్టివల్కి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

­కాగా ఫ్లెమింగో ఫెస్టివల్ను కార్యక్రమ చిత్రీకరణను ఏఎస్పీ గంగాధర్ అడ్డుకున్నారు. కెమెరామన్, ఫొటోగ్రాఫర్లను స్టేజీ మధ్యలోంచి పోలీసులు లాగేశారు. దీంతో ఫ్లెమింగో ఫెస్టివల్ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు పాత్రికేయులు ప్రకటించారు. అనంతరం పాత్రికేయులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement