పంటపొలాల్లో మారణాయుధాలు | Firearms in the fields at prakasham | Sakshi
Sakshi News home page

పంటపొలాల్లో మారణాయుధాలు

Oct 8 2016 9:44 AM | Updated on Oct 2 2018 6:42 PM

పంటపొలాల్లో మారణాయుధాలు - Sakshi

పంటపొలాల్లో మారణాయుధాలు

ప్రకాశం జిల్లా కుంభం మండలం లింగోజీపల్లి సమీపంలోని పంటపొలాల్లో నాటుతుపాకీ, కత్తి, పేలుడు సామగ్రి కనిపించటం కలకలం రేపింది.

కుంభం : ప్రకాశం జిల్లా కుంభం మండలం లింగోజీపల్లి సమీపంలోని పంటపొలాల్లో నాటుతుపాకీ, కత్తి, పేలుడు సామగ్రి కనిపించటం కలకలం రేపింది. శనివారం ఉదయం వీటిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. శుక్రవారం రాత్రి ఇక్కడ కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా స్థానికులు గుర్తించారు. వారిలో ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

విచారించిన  పోలీసులు వారిని వదిలేశారు. శనివారం ఉదయం  రావూరి చిన వెంకటరాజు పొలం సమీపంలో మారణాయుధాలు కనిపించటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఎవరినైనా చంపేందుకు సదరు వ్యక్తులు మాటువేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement