కొండ్రెడ్డిగారిపల్లిలో అగ్ని ప్రమాదం | fire accident in Sundupalli | Sakshi
Sakshi News home page

కొండ్రెడ్డిగారిపల్లిలో అగ్ని ప్రమాదం

Aug 9 2016 8:20 AM | Updated on Sep 5 2018 9:47 PM

వైఎస్ఆర్ జిల్లా సుండుపల్లి మండలం కొండ్రెడ్డిగారిపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ ఇల్లు పూర్తిగా కాలిపోయింది.

రాయచోటి : వైఎస్ఆర్ జిల్లా సుండుపల్లి మండలం కొండ్రెడ్డిగారిపల్లిలో సోమవారం అర్థరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ ఇల్లు పూర్తిగా కాలిపోయింది. గ్రామానికి చెందిన వీరనాగయ్య, అతని కుటుంబసభ్యులు ఇంట్లో నిద్రిస్తుండగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.

దాంతో వారంతా వెంటనే అప్రమత్తమై ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. స్థానికులు వెంటనే స్పందించి.. మంటలు ఆర్పివేశారు. అయితే ఇంట్లోని నగదు, సామగ్రి అంతా అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement