ఆత్మకూరురూరల్ : మున్సిపాలిటీ పరిధిలో గత 20 రోజులుగా కలుషిత తాగునీరు సరఫరా అవుతోందని పట్టణ ప్రజలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.
మాజీ మంత్రి ఎదుట వాదులాట
Aug 13 2016 1:05 AM | Updated on Jul 11 2019 8:34 PM
ఆత్మకూరురూరల్ : మున్సిపాలిటీ పరిధిలో గత 20 రోజులుగా కలుషిత తాగునీరు సరఫరా అవుతోందని పట్టణ ప్రజలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం మండలంలోని చెర్లోయడవల్లి గ్రామానికి వచ్చిన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వద్ద దీనిపై రెండువర్గాలు చిన్నపాటి వాదులాటకు దిగాయి. కలుషిత నీటి వ్యవహారాన్ని ఆనం దష్టికి ఆయన అనుచరులు తీసుకెళ్లారు. మున్సిపల్ పాలకవర్గం సైతం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇదే సమయంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రాగి వనమ్మ ఆనంతో భేటీ అయ్యేందుకు అక్కడికి వచ్చారు. దీంతో ఆమె సమస్యలుంటే తన దష్టికి తేవచ్చు కదా అనడంతో కొద్దిసేపు ఆనం అనుచరులు, చైర్‌పర్సన్ వాదులాడుకున్నారు. దీంతో అక్కడే ఉన్న టీడీపీ నాయకులు డాక్టర్ ఆదిశేషయ్య, చల్లారవి తదితరులు దీనిపై అందరం ఒకచోట కూర్చొని చర్చించుకుందాం అనడంతో ఆనం కలుగజేసుకొని ఎక్కడో ఎందుకు నెలాఖరులో ‘అధికారికంగా’ మున్సిపల్ కార్యాలయంలో కూర్చుని మాట్లాడుకుందాం అనడంతో సమస్య సద్దుమణిగింది. ఆనం మాటలను బట్టి ఆయన అనుచరులు ఈనెల 15వ తేదీ తర్వాత ఇన్‌చార్జి మార్పు ఉండొచ్చని భావిస్తున్నారు.
Advertisement
Advertisement