దాయాదుల మధ్య స్థలం విషయంలో చోటు చేసుకున్న ఘర్షణలో ఓ వృద్ధుడు మృతి చెందాడు.
దాయాదుల మధ్య ఘర్షణలో వృద్ధుడి మృతి
Nov 28 2016 12:11 AM | Updated on Oct 2 2018 6:46 PM
బండిఆత్మకూరు: దాయాదుల మధ్య స్థలం విషయంలో చోటు చేసుకున్న ఘర్షణలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. పార్నపల్లె గ్రామానికి చెందిన సుందర్‌రావు(65), ఆయనకు కుమారుడు వరుస అయ్యే మహానంది స్వయాన దాయాదులు. వీరి ఇళ్లకు సమీపంలో ఉన్న రహదారి విషయంలో వివాదం ఉంది. ఈ క్రమంలో వీరి మధ్య ఆదివారం వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహానికి లోనైన మహానంది.. సుందర్‌రావు తలపై కర్రతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అతడిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కోలుకోలేక మృతి చెందారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు మహానందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement