కూతురిపై తండ్రి లైంగిక వేధింపులు | Father sexual harassment on daughter | Sakshi
Sakshi News home page

కూతురిపై తండ్రి లైంగిక వేధింపులు

Mar 7 2016 2:04 AM | Updated on Jul 23 2018 9:13 PM

కూతురిపై తండ్రి లైంగిక వేధింపులు - Sakshi

కూతురిపై తండ్రి లైంగిక వేధింపులు

కన్నకూతురిపై కన్నేసిన తండ్రి లైంగిక వాంఛ తీర్చాలని వేధించాడు. వేధింపులు తట్టుకోలేక అతడి భార్య కూతురుతో కలసి

తట్టుకోలేక కూతురితో కలసి భర్తను చంపిన భార్య
 
వీణవంక: కన్నకూతురిపై కన్నేసిన తండ్రి లైంగిక వాంఛ తీర్చాలని వేధించాడు. వేధింపులు తట్టుకోలేక అతడి భార్య కూతురుతో కలసి అతడిని హతమార్చిన ఉదంతం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగాపూర్‌లో ఆదివారం జరిగింది. జిల్లాలోని కమలాపూర్ మండలం కన్నూర్‌కు చెందిన రావుల సంపత్ అత్తగారి ఇల్లయిన నర్సింగాపూర్‌కు పదేళ్ల క్రితం కుటుంబంతో సహా వచ్చాడు. సంపత్‌కు భార్య తిరుపతమ్మ, కూతురు(16), కుమారుడు వంశీ ఉన్నారు. సంపత్, తిరుపతమ్మ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.

కూతురు ఇంటర్మీడియెట్ ఫస్టియర్ చదువుతోంది. ఇప్పుడు పరీక్షలు రాస్తోంది. మద్యానికి బానిసైన సంపత్ కన్ను కన్నకూతురుపై పడింది. తన లైంగిక వాంఛ తీర్చమంటూ ఐదు నెలలుగా కూతురును వేధిస్తున్నాడు. శనివారం రాత్రి బాగా మద్యం తాగి వచ్చిన అతడు కూతురును కోరిక తీర్చమంటూ వేధించాడు. ఇది తట్టుకోలేక సంపత్ భార్య తిరుపతమ్మ, ఆమె సోదరి లక్ష్మి, కూతురు కలసి సంపత్‌ను ఇంటి ముందు కర్రకు కట్టేసి రోకలిబండతో చితకబాదారు. తీవ్ర రక్తస్రావంతో సంపత్ ఆదివారం ఉదయం మరణించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement