సిద్దిపేట జిల్లా మిర్దొడ్డిలో విషాదం | family suicide attempt with problems | Sakshi
Sakshi News home page

సిద్దిపేట జిల్లా మిర్దొడ్డిలో విషాదం

Nov 16 2016 7:58 AM | Updated on Sep 18 2018 7:34 PM

సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం ధర్మారంలో విషాదం చోటుచేసుకుంది.

మిర్దొడ్డి(సిద్ధిపేట): సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలంలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక ఓ కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఘటనలో కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన ఓ కుటుంబం మంగళవారం రాత్రి విషాహారం తిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గుర్తించిన చుట్టుపక్కల వారు ఆస్పత్రికి తరలించగా.. తండ్రీ కొడుకులు మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement