రూ. 10 వేలకు రూ. 20 వేల విలువైన ఫుడ్ కూపన్లు... | Fake coupons gang busted in vijayawada city police | Sakshi
Sakshi News home page

రూ. 10 వేలకు రూ. 20 వేల విలువైన ఫుడ్ కూపన్లు...

Aug 13 2015 11:25 AM | Updated on Sep 3 2017 7:23 AM

నకిలీ కూపన్ల తయారు చేస్తున్న ముఠా గుట్టును విజయవాడ పటమట పోలీసులు గురువారం రట్టు చేశారు.

విజయవాడ: నకిలీ కూపన్ల తయారు చేస్తున్న ముఠా గుట్టును విజయవాడ పటమట పోలీసులు గురువారం రట్టు చేశారు. అందుకు సంబంధించి హేమంత్, సందీప్లను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలు తమ సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు కూపన్లు ఇస్తూ ఉంటుంది. ఆ కూపన్లు షాపింగ్ మాల్స్తోపాటు స్టార్ హోటళలో సదరు ఉద్యోగులు నగదుకు బదులు ఇస్తుంటారు.

అయితే రూ. 10 వేలు చెల్లిస్తే... 20 వేల విలువైన కూపన్ల అంటూ ఈ ముఠా పలువురికి ఎర వేసింది. దాంతో నలుగురు వ్యక్తులు రూ. 10 వేల విలువైన కూపన్ల కొనుగోలు చేసి షాపింగ్ మాల్స్కి వెళ్లారు. అయితే అవి నకిలీవని తెలింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ క్రమంలో నకిలీ కూపన్ల ముఠా గుట్టును పోలీసులు ఛేదించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement