ఈఎస్‌ఐ హాస్పిటళ్ల పరిధిని విస్తరించండి | extend esi hospitals limits | Sakshi
Sakshi News home page

ఈఎస్‌ఐ హాస్పిటళ్ల పరిధిని విస్తరించండి

Dec 7 2016 9:22 PM | Updated on Aug 9 2018 8:15 PM

ఈఎస్‌ఐ హాస్పిటళ్ల పరిధిని విస్తరించండి - Sakshi

ఈఎస్‌ఐ హాస్పిటళ్ల పరిధిని విస్తరించండి

కర్నూలులోని ఈఎస్‌ఐ హాస్పిటళ్ల పరిధిని విస్తరించి అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కేంద్ర కార్మిక ఉపాధి కల్పనశాఖ మంత్రి బండారు దత్తాత్రేయకు ఎంపీ బుట్టారేణుక విన్నవించారు.

– కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయకు ఎంపీ బుట్టా వినతి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : కర్నూలులోని ఈఎస్‌ఐ హాస్పిటళ్ల పరిధిని విస్తరించి అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కేంద్ర కార్మిక ఉపాధి కల్పనశాఖ మంత్రి బండారు దత్తాత్రేయకు ఎంపీ బుట్టారేణుక విన్నవించారు. బుధవారం ఎంపీ మంత్రిని ఆయన కార్యాలయంలో కలసి తన నియోజకవర్గంలోని పలు సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ  మాట్లాడుతూ.. కర్నూలు పార్లమెంట్‌ పరిధిలోని వివిధ పరిశ్రమలు, ప్రైవేట్‌ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు బీమా, ఆరోగ్య సేవలు, కనీస వేతనాలు అందేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. జిల్లాలోని ఉపాధి కల్పన కార్యాలయాలు, ఐఐటీ కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించి నైపుణ్యాభివృద్ధికి చర్యలు చేపట్టాలనా​‍్నరు. అంతేగాక నిరుద్యోగులకు వారికి ఇష్టమైన రంగంలో శిక్షణ తరగతులను ఏర్పాటు చేసి స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలని,  కర్నూలుకు మంజూరు చేసిన రీజినల్‌ ప్రావిడెండ్‌ ఫండ్‌ కార్యాలయాన్ని త్వరగా ప్రారంభించాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ ఓ ప్రకటనలో తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement