కీసరలో వైభవంగా రుద్రాభిషేకం | exposition rudrabhisekam in kisara | Sakshi
Sakshi News home page

కీసరలో వైభవంగా రుద్రాభిషేకం

Jul 25 2016 4:47 PM | Updated on Mar 28 2018 11:26 AM

కీసరలో వైభవంగా రుద్రాభిషేకం - Sakshi

కీసరలో వైభవంగా రుద్రాభిషేకం

ప్రఖ్యాతశైవ క్షేత్రమైన కీసర గుట్ట శ్రీభవానీరామలింగేశ్వర స్వామి సన్నిదిలో సోమవారం నాడు స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని వేదపండితులు వైభవంగా నిర్వహించారు.

కీసర: ప్రఖ్యాతశైవ క్షేత్రమైన కీసర గుట్ట శ్రీభవానీరామలింగేశ్వర స్వామి సన్నిదిలో సోమవారం నాడు స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని వేదపండితులు వైభవంగా నిర్వహించారు. ఉదయం గర్బాలయంలో కొలువైన శ్రీస్వామివారికి రుద్రాభిషేకం అనంతరం భక్తులు  సాముహిక అభిషేకాల్లో పాల్గొన్నారు. ఉదయం 11 గంటల సమయంలో స్వామివారికి పల్లకీసేవను నిర్వహించారు. ఆలయ ఛైర్మెన్‌ తటాకం ఉమాపతిశర్మ, భక్తులు తదితరులుపాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement