కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం కారణాలతో తీవ్ర మనస్తాపం చెందిన మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన మాజీ సర్పంచ్ సిద్దా కృష్ణమూర్తి(60) మూడు దశాబ్దాలుగా తన కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక చిట్టోడితోటలోని రజక వీధిలో నివసిస్తున్నారు.
మాజీ సర్పంచ్ ఆత్మహత్య
Sep 6 2016 10:56 PM | Updated on Nov 6 2018 8:04 PM
పిఠాపురం టౌన్ :
కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం కారణాలతో తీవ్ర మనస్తాపం చెందిన మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన మాజీ సర్పంచ్ సిద్దా కృష్ణమూర్తి(60) మూడు దశాబ్దాలుగా తన కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక చిట్టోడితోటలోని రజక వీధిలో నివసిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి తనఇంట్లో నైలాన్‌తాడుతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పిఠాపురం సీఐ ఎండీ ఉమర్, ఎస్సై కోటేశ్వరరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కృష్ణమూర్తి కుమారుడు కాశీవిశ్వనాథ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement