గుండెపోటుతో మాజీ సర్పంచ్‌ మృతి | ex- former sarpanch death with heart attack | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో మాజీ సర్పంచ్‌ మృతి

Oct 4 2016 4:52 PM | Updated on Sep 28 2018 3:41 PM

గుండెపోటుతో మాజీ సర్పంచ్‌ మృతి చెందిన సంఘటన మండలంలోని వెంటాపూర్‌లో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.

సిద్దిపేట రూరల్‌: గుండెపోటుతో మాజీ సర్పంచ్‌ మృతి చెందిన సంఘటన మండలంలోని వెంటాపూర్‌లో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ యాదమ్మ (50) సిద్దిపేట పట్టణంలో కుటుంబ సభ్యులతో నివాసం ఉంటోంది. సోమవారం అర్ధరాత్రి గుండెనొప్పి రావడంతో కుటుంబీకులు ఆమెను పట్టణంలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె అంత్యక్రియలను వెంకటాపూర్‌లో నిర్వహించారు. రెండు దశాబ్దాల పాటు ఆమో వెంకటాపూర్‌ సర్పంచ్‌గా పని చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement