ఇంజినీరింగ్‌ కళాశాల అధ్యాపకుడి హత్య | Engineering college lecturer murdered | Sakshi
Sakshi News home page

ఇంజినీరింగ్‌ కళాశాల అధ్యాపకుడి హత్య

Oct 16 2016 10:17 PM | Updated on Jul 30 2018 8:29 PM

మండలంలోని బొప్పూడి– మురికిపూడి గ్రామాల మధ్య రామచంద్రాపురం శివారులో ఇంజినీరింగ్‌ అధ్యాపకుడు హత్యకు గురయ్యాడు.

చిలకలూరిపేట రూరల్‌: మండలంలోని బొప్పూడి– మురికిపూడి గ్రామాల మధ్య రామచంద్రాపురం శివారులో ఇంజినీరింగ్‌ అధ్యాపకుడు హత్యకు గురయ్యాడు. రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.  బొప్పూడి– మురికిపూడి గ్రామాల మధ్య వ్యక్తి హత్య జరిగిందని ఆదివారం పోలీసులకు సమాచారం అందడంతో  çఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహానికి సమీపంలో బీరుబాటిల్, సెల్‌ఫోన్‌ సిమ్‌కార్డు లభించింది. సిమ్‌ ఆధారంగా మృతిచెందింది చిలకలూరిపేట పట్టణానికి చెందిన నెల్లి రమణ (34)గా గుర్తించి కుటుంబ సభ్యులకు  సమాచారం అందించారు.  రమణ నరసరావుపేట ఇంజనీరింగ్‌ కళాశాలలో అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్నారు.  శనివారం రాత్రి  నుంచి ఇంటికి రాలేదు. మృతుడికి భార్య, ఇరువురు కుమారులు ఉన్నారు.   కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ సీఐ యు.శోభన్‌బాబు తెలిపారు. కాగా, మృతిచెందిన రమణ చిట్టీలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. శనివారం సాయంత్రం చిట్టీ డబ్బుల కోసం బొప్పూడి వెళుతున్నట్లు సోదరునికి తెలిపి, ఇద్దరు వ్యక్తులతో ద్విచక్రవాహనంపై వెళ్లినట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement