ఆరోపణలపై స్పందించిన సీఐ బంగార్రాజు | Elugu two town CI bangaraju denies allegations | Sakshi
Sakshi News home page

ఆరోపణలపై స్పందించిన సీఐ బంగార్రాజు

Jul 19 2016 4:11 PM | Updated on Sep 4 2017 5:19 AM

తనపై వచ్చిన ఆరోపణలపై పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు టూ టౌన్ సీఐ బంగార్రాజు స్పందించారు.

ఏలూరు : తనపై వచ్చిన ఆరోపణలపై పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు టూ టౌన్ సీఐ బంగార్రాజు స్పందించారు. తాను ఎవరినీ వేధించలేదని, చట్టప్రకారమే వ్యవహరించినట్లు ఆయన మంగళవారమిక్కడ తెలిపారు. ఆ అమ్మాయి కావాలనే తనపై ఆరోపణలు చేస్తోందని సీఐ అన్నారు. యువతి ఫిర్యాదు మేరకు మోసం చేసిన యువకుడిపై కేసు పెట్టి అరెస్ట్ చేశామన్నారు.

కాగా కేసు పెడితే న్యాయం చేయకుండా సీఐ తనను ఇంటికి రమ్మంటున్నారని ఓ యువతి జిల్లా ఎస్పీ భాస్కరభూషణ్‌కి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తన మేనకోడలికి న్యాయం చేయకపోతే బుధవారం నుంచి ఆమరణ దీక్ష చేపడతానని బాధితురాలి మేనమామ హెచ్చరించారు. చదవండి...(సీఐ నన్ను ఇంటికి రమ్మన్నారు)
 

Advertisement
 
Advertisement
Advertisement