west godavari sp
-
మైనర్ బాలిక అత్యాచారం కేసు.. పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
సాక్షి, పశ్చిమగోదావరి: భీమవరానికి చెందిన మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో తెలుగుదేశం పార్టీ నేతను కాపాడేందుకు పోలీసులు బరితెగించడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీకు సిగ్గు అనిపించట్లేదా? బాలిక ఫిర్యాదు వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని మీరు ఎలా చెబుతారు? దేవుడు మీకు దివ్యదృష్టి ఏమైనా ఇచ్చారా? ఫిర్యాదారుడు స్పష్టమైన ఆరోపణలు చేసినప్పుడు ఆ అంశంపై దృష్టి పెట్టి దర్యాప్తు కొనసాగించాలి. బాధితురాలు తనపై అఘాయిత్యం జరిగిందన్న దానికి సంబంధించి 164 స్టేట్మెంట్ వాంగ్మూలాలు ఇతర ఆధారాలు ఉన్నాయని చెబితే దాని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని మీరు ఎలా చెబుతారు? బాధితురాలకు అండగా ఉండాల్సింది పోయి కేసు ఉపసంహరించుకోమని బెదిరిస్తారా? రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేకుంటే ఉద్యోగాలు మానేసి వెళ్లిపోండి. మీరు దర్యాప్తు సక్రమంగా నిష్పక్షపాతంగా నిర్వహించట్లేదు కాబట్టే న్యాయం కోసం బాధితురాలు కోర్టుకు రావాల్సి వచ్చింది. మీ బాధ్యత మీకు కొంతైనా తెలియాలంటే ఒకసారి బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు చదవండి’ అంటూ హైకోర్టు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు వివరణ సంతృప్తిగా లేదని హైకోర్టు పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి అన్ని రికార్డులతో పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ స్వయంగా తమ ముందు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణ మే ఒకటో తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. -
ఆరోపణలపై స్పందించిన సీఐ బంగార్రాజు
ఏలూరు : తనపై వచ్చిన ఆరోపణలపై పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు టూ టౌన్ సీఐ బంగార్రాజు స్పందించారు. తాను ఎవరినీ వేధించలేదని, చట్టప్రకారమే వ్యవహరించినట్లు ఆయన మంగళవారమిక్కడ తెలిపారు. ఆ అమ్మాయి కావాలనే తనపై ఆరోపణలు చేస్తోందని సీఐ అన్నారు. యువతి ఫిర్యాదు మేరకు మోసం చేసిన యువకుడిపై కేసు పెట్టి అరెస్ట్ చేశామన్నారు. కాగా కేసు పెడితే న్యాయం చేయకుండా సీఐ తనను ఇంటికి రమ్మంటున్నారని ఓ యువతి జిల్లా ఎస్పీ భాస్కరభూషణ్‌కి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తన మేనకోడలికి న్యాయం చేయకపోతే బుధవారం నుంచి ఆమరణ దీక్ష చేపడతానని బాధితురాలి మేనమామ హెచ్చరించారు. చదవండి...(సీఐ నన్ను ఇంటికి రమ్మన్నారు) -
‘సీఐ తన ఇంటికి రమ్మన్నారు’
-
‘సీఐ తన ఇంటికి రమ్మన్నారు’
ఎస్పీకి ఫిర్యాదు చేసిన యువతి న్యాయం జరగకపోతే ఆమరణ దీక్ష చేస్తానంటున్న మేనమామ వివాదంలో ఏలూరు టూ టౌన్ సీఐ ఏలూరు : కేసు పెడితే న్యాయం చేయకుండా సీఐ తనను ఇంటికి రమ్మంటున్నారని ఒక యువతి జిల్లా ఎస్పీ భాస్కరభూషణ్‌కి ఫిర్యాదు చేసింది. తన మేనకోడలికి న్యాయం చేయకపోతే బుధవారం నుంచి ఆమరణ దీక్ష చేపడతానని ఆ యువతి మేనమామ ప్రకటించారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరానికి చెందిన ఒక యువతిని ఫత్తేబాద్కు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు ప్రేమపేరుతో వలలో వేసుకున్నాడు. అమ్మ, నాన్న చిన్నతనంలోనే చనిపోవడంతో ఆ యువతి అమ్మమ్మ, తాత, మేనమామల వద్ద ఉంటోంది. పదో తరగతి చదివిన ఆ యువకుడు తాను ఎంబీఏనంటూ ఆ యువతిని మోసం చేశాడు. వివిధ కారణాలు చెబుతూ ఆ యువతి నుంచి రూ.మూడు లక్షల వరకూ వసూలు చేశాడు. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో ఏప్రిల్‌లో ఆ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ తర్వాత యువకుడు వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది. తర్వాత మళ్లీ ఆ యువకుడితో పెళ్లి చేయించాలంటూ స్టేషన్ ముందు ఆందోళన చేసింది. దీనిపై టూటౌన్ సీఐ బంగార్రాజు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత యువకుడిపై కేసు పెడితే ఉద్యోగం పోతుందని అతని స్నేహితుడు అమ్మాయి వద్ద డబ్బులు వసూలు చేశాడు. ఈ విషయంపై కూడా ఆ యువతి ఫిర్యాదు చేయడంతోపాటు తనకు న్యాయం జరగడం లేదంటూ ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆ యువకుడిపై ఈవ్‌టీజింగ్ కేసు పెట్టి అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసు విషయంలో సీఐ తనను ఇంటికి పిలిపించి కౌన్సెలింగ్ పేరుతో అసభ్యంగా మాట్లాడారని ఆరోపిస్తూ ఆ యువతి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీనిపై సీఐ బంగార్రాజు వివరణ ఇస్తూ ఇప్పటికే ఆ అమ్మాయి మూడుసార్లు ప్రేమించిన యువకుడి కోసం ఆత్మహత్యాయత్నం చేసిందని, అమ్మాయి మానసిక స్థితి సరిగా లేదని చెప్పారు. తాను అమ్మాయికి ఫోన్ చేసినట్టు ఏ ఆధారాలు ఉన్నా చూపించాలని కోరారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు.


