గత మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో విద్యుత్ శాఖకు రూ.7 లక్షల మేర నష్టం వాటిల్లింది. వర్షాల తీవ్రతకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 116 స్తంభాలు పడిపోగా, 13 ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసమయ్యాయి.
విద్యుత్‌శాఖకు రూ. 7లక్షల నష్టం
Sep 25 2016 11:12 PM | Updated on Sep 4 2017 2:58 PM
నిజామాబాద్ నాగారం:
గత మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో విద్యుత్ శాఖకు రూ.7 లక్షల మేర నష్టం వాటిల్లింది. వర్షాల తీవ్రతకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 116 స్తంభాలు పడిపోగా, 13 ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లోనే 91 స్తంభాలు ధ్వంసమైనట్లు గుర్తించారు. అయితే, వర్షాలు తగ్గిన తర్వాత పూర్తి స్థాయిలో విచారణ జరిపితే ఈ నష్టం మరింత పెరిగే అవకాశం ఉంటుందని ఎస్‌ఈ ప్రభాకర్ తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేశామని, ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
Advertisement
Advertisement