నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం యానాంపల్లి తండాలో ఆదివారం ఉదయం గుడిసెపై విద్యుత్ తీగలు తెగిపడి 70 మేకలు మృతి చెందాయి.
నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం యానాంపల్లి తండాలో ఆదివారం ఉదయం గుడిసెపై విద్యుత్ తీగలు తెగిపడి 70 మేకలు మృతి చెందాయి. విద్యుత్ తీగలు పడడంతో గుడిసె అంటుకుని అందులో ఉన్న 70 మేకలు చనిపోయాయి. సంఘటన స్థలాన్ని ఎంపీపీ ఇందిర, తహశీల్దార్ రవీందర్, సర్పంచ్ శ్రీనివాసగౌడ్ ఆదివారం మధ్యాహ్నం సందర్శించారు. బాధితునికి ఆర్థిక సహాయం అందిస్తామని వారు హామీ ఇచ్చారు.