గుట్కా స్వాధీనం
దువ్వాడ పోలీస్‌సేష్టన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు గుట్కా ప్యాకెట్లు తరలిస్తుండగా టాస్క్‌ఫోర్సు పోలీసులు దాడులు చేశారు.
సీతమ్మధార: దువ్వాడ పోలీస్‌సేష్టన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు గుట్కా ప్యాకెట్లు తరలిస్తుండగా టాస్క్‌ఫోర్సు పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో దాదాపు రూ.2లక్షల విలువ గల గుట్కా ప్యాకెట్లు ను టాస్క్‌ఫోర్సు పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. దువ్వాడ పోలీస్‌స్టేషన్ పరిధిఆలోని యాదవ జగ్గారావు పేట వద్ద ఇద్దరు వ్యక్తులు గుట్కాప్యాకెట్లు ఆటోలో తరలిస్తున్నరని స్థానికుల సమాచారంతో ఆదివారం టాస్క్‌ఫోర్సు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆటోతో పాటు సుమారు రెండులక్షల రూపాయలు విలువ గల గుట్కాప్యాకెట్లు స్వాధీనపరుచుకుని దువ్వాడ పోలీసులకు అప్పగించారు. ఈ దాడుల్లో ఏసీపీ చిట్టిబాబు ఆధ్వర్యంలో ఎస్‌ఐలు గణేష్, సతీష్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.