జీవన సిత్రం.! | drainage cleans in anantapur | Sakshi
Sakshi News home page

జీవన సిత్రం.!

Nov 17 2016 11:29 PM | Updated on Sep 29 2018 5:10 PM

జీవన సిత్రం.! - Sakshi

జీవన సిత్రం.!

ఈ చిత్రాన్ని చూస్తే ‘శ్రమ జీవుల స్వేదానికి ఖరీదు కట్టే షరాబులు లేరు’ అన్న మహాకవి శ్రీశ్రీ మాటలు గుర్తుకు వస్తున్నాయి కదూ?

ఈ చిత్రాన్ని చూస్తే ‘శ్రమ జీవుల స్వేదానికి ఖరీదు కట్టే షరాబులు లేరు’ అన్న మహాకవి శ్రీశ్రీ మాటలు గుర్తుకు వస్తున్నాయి కదూ? ఔను! మన ఇంటి ఎదుట కొద్ది పాటి రోత ఉంటే కాలు కూడా పెట్టలేం. దుర్వాసన వస్తే భరించలేం. మరీ మలమూత్రాలు కలగలసిన మురుగు కాలువను ఈ కష్టజీవులు నిండా మునిగి శుభ్రం చేశారు. వీరి శ్రమను చూసిన వారు ముక్కన వేలేసుకున్నారు.

అనంతపురం నడిబొడ్డున ఉన్న మరువ వంకను వట్టి చేతులతోనే గురువారం వీరు శుభ్రం చేయడానికి పూనుకున్నారు. ఓ వైపు భరించలేని దుర్వాసన.. మరో వైపు పురుగుపుట్ర సంచారం వారిని ఇబ్బంది పెడుతున్నా... పగిలిన గాజు పెంకులు గుచ్చుకుంటున్నా... ఒట్టి కాళ్లతో కాలువలో దిగి చేతులతో వ్యర్థాలను తొలగించారు.
- వీరేష్‌, సాక్షి ఫొటోగ్రాఫర్‌, అనంతపురం

Advertisement
 
Advertisement
Advertisement