రెండంకెల వృద్ధిరేటు సాధనపై దృష్టి పెట్టాలి | Double-digit growth, focus on accountability | Sakshi
Sakshi News home page

రెండంకెల వృద్ధిరేటు సాధనపై దృష్టి పెట్టాలి

Aug 23 2016 1:33 AM | Updated on Sep 4 2017 10:24 AM

రెండంకెల వృద్ధిరేటు సాధనపై దృష్టి పెట్టాలి

రెండంకెల వృద్ధిరేటు సాధనపై దృష్టి పెట్టాలి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాథమిక వ్యవసాయ రంగ మిషన్‌ కింద రెండంకెల వృద్ధి రేటు (డబుల్‌ డిజిట్‌ గ్రోత్‌) సాధించడానికి వ్యవసాయ, అనబంధ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రణాళికశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ (సీపీవో డీడీ) డి.బసవరాజు, ఆర్థిక నిపుణులు బాబయ్య తెలిపారు.

అనంతపురం అగ్రికల్చర్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాథమిక వ్యవసాయ రంగ మిషన్‌ కింద రెండంకెల వృద్ధి రేటు (డబుల్‌ డిజిట్‌ గ్రోత్‌) సాధించడానికి వ్యవసాయ, అనబంధ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రణాళికశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ (సీపీవో డీడీ) డి.బసవరాజు, ఆర్థిక నిపుణులు బాబయ్య తెలిపారు. కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక డీఆర్‌డీఏ అభ్యుదయ హాలులో ప్రణాళికశాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ, అనుబంధశాఖల అధికారులకు వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు తమ శాఖలో అమలు చేస్తున్న పథకాలు, రెండంకెల వృద్ధి రేటు సాధనకు తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు.  ఈ సందర్భంగా అన్ని శాఖల ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement