మాట్లాడుతున్న పీవో వెంకటరావు
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఒడిశా విద్యార్థులను చేర్చుకోవద్దని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి జల్లేపల్లి వెంకటరావు ఆదేశించారు. ఐటీడీఏలో హెచ్‌ఎంలతో శుక్రవారం ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కూడా తాను చెప్పినా చిన్నకోస్తాలో 26 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. ఈ నెల 5వ తేదీలోగా ప్రీమెట్రిక్ స్కాలర్ విద్యార్థుల వివరాలు ఈ–పాస్‌లో నమోదు చేయాలన్నారు.
సీతంపేట : గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఒడిశా విద్యార్థులను చేర్చుకోవద్దని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి జల్లేపల్లి వెంకటరావు ఆదేశించారు. ఐటీడీఏలో హెచ్‌ఎంలతో శుక్రవారం ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కూడా తాను చెప్పినా చిన్నకోస్తాలో 26 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. ఈ నెల 5వ తేదీలోగా ప్రీమెట్రిక్ స్కాలర్ విద్యార్థుల వివరాలు ఈ–పాస్‌లో నమోదు చేయాలన్నారు.
30 మంది కంటే ఎక్కువ మంది విద్యార్థుల వివరాలు అప్‌లోడ్ చేయాల్సిన పాఠశాలలు 13 వరకు ఉన్నాయన్నారు. సంబంధిత హెచ్‌ఎంలు ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఉప విద్యాశాఖాధికారి వి.మల్లయ్య మాట్లాడుతూ ఎన్టీఆర్ విద్యాజ్యోతి పథకంలో 5 నుంచి 8 తరగతుల డే స్కాలర్ విద్యార్థులకు ఉపకార వేతనాలు వస్తాయన్నారు. విద్యార్థికి రూ.వెయ్యి రూపాయిలు, విద్యార్థినికి రూ.1500లు ఏడాదికి ఇవ్వనున్నట్టు తెలిపారు. సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ yీ డీ ఎంపీవీ నాయిక్, గురుకులం సెల్ ఇన్‌చార్జి వెంకటేశ్వరరావు, హెచ్‌ఎంలు ఎ.లిల్లీరాణి, పి.నారాయుడు, కె.సుబ్బారావు, చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.