ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం తగదు | dont delay on complaints | Sakshi
Sakshi News home page

ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం తగదు

Feb 28 2017 1:25 AM | Updated on Jun 1 2018 8:39 PM

అనంతపురం సెంట్రల్‌ : ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం తగదని అనంతపురం రేంజ్‌ డీఐజీ ప్రభాకర్‌రావు అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం, డిస్టిక్‌ క్రైం రికార్డు బ్యూరో(డీసీఆర్‌బీ)లను డీఐజీ తనిఖీ చేశారు.

= పోలీసు అధికారులకు డీఐజీ ప్రభాకర్‌రావు   
= జిల్లా పోలీసు కార్యాలయం, డీసీఆర్‌బీల తనిఖీ  

అనంతపురం సెంట్రల్‌ : ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం తగదని అనంతపురం రేంజ్‌ డీఐజీ ప్రభాకర్‌రావు అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం, డిస్టిక్‌ క్రైం రికార్డు బ్యూరో(డీసీఆర్‌బీ)లను డీఐజీ తనిఖీ చేశారు. ముందుగా పోలీసు కాన్ఫరె¯Œ్స హాలులో సమావేశం నిర్వహించారు. రోజువారి విధులు, పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. పనితీరు, గణాంకాలకు సంబంధించి జిల్లా ఎస్పీ ఎస్వీ రాజశేఖరబాబు పవర్‌పాయింట్‌ ప్రెజెంటేష¯ŒS ద్వారా వివరించారు. జిల్లా పోలీసు సిబ్బంది సంక్షేమానికి ‘సన్నిహితం’ పేరుతో మరో కొత్తయాప్‌ను రూపొందించినట్లు తెలిపారు.  కొత్త యాప్‌ విధివిధానాలను వివరించారు.

అనంతరం డీఐజీ మాట్లాడుతూ జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది బాగా పని చేస్తే క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే కానిస్టేబుళ్లు, అధికారులు సంతృప్తి చెందుతారన్నారు.  ప్రజల పిటిషన్లకు కూడా వేగంగా పరిష్కారం చూపించాలన్నారు. అలాగే ప్రతి అంశాన్నీ లోతుగా దర్యాప్తు చేయాలన్నారు. విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయం, డీసీఆర్‌బీలోని పలు విభాగాలను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు.  కార్యక్రమంలో అదనపు ఎస్పీలు మాల్యాద్రి, శ్రీనివాసరావు, డీఎస్పీలు మల్లికార్జున, మల్లికార్జునవర్మ, చిన్నికృష్ణ, జిల్లా పోలీసు కార్యాలయం ఏఓ సూర్యనారాయణ, డీఐజీ మేనేజర్‌ సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement