‘కృష్ణా పరివాహక ప్రాంతాలను కొత్త జిల్లాల్లో చేర్చి మహబూబ్‌నగర్‌ను ఎడారి చేస్తారా, వలసల జిల్లాగానే మిగిలిస్తారా..’ అంటూ డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ ప్రశ్నించారు. బుధవారం డీసీసీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ముసాయిదాపై అభ్యంతరాల గడువు పూర్తికాక ముందే వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల ఏర్పాట్లు చేస్తుండడం ఎంతవరకు సమంజసమన్నారు. నడిగడ్డ ప్రాంతాన్ని గద్వాల కేంద్రంగా జిల్లా చేయాలని అక్క
పాలమూరు ఎడారి చేస్తారా?
Sep 15 2016 12:48 AM | Updated on Sep 4 2017 1:29 PM
మహబూబ్‌నగర్ అర్బన్ : ‘కృష్ణా పరివాహక ప్రాంతాలను కొత్త జిల్లాల్లో చేర్చి మహబూబ్‌నగర్‌ను ఎడారి చేస్తారా, వలసల జిల్లాగానే మిగిలిస్తారా..’ అంటూ డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ ప్రశ్నించారు. బుధవారం డీసీసీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ముసాయిదాపై అభ్యంతరాల గడువు పూర్తికాక ముందే వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల ఏర్పాట్లు చేస్తుండడం ఎంతవరకు సమంజసమన్నారు. నడిగడ్డ ప్రాంతాన్ని గద్వాల కేంద్రంగా జిల్లా చేయాలని అక్కడి ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తుంటే వాటిని ప్రభుత్వం పక్కనబెట్టడం తగదన్నారు.
జూరాల ప్రాజెక్టు ఉన్న ఆత్మకూర్, అమరచింత మండలాలను, పరిశ్రమలు ఉన్న షాద్‌నగర్‌ను మహబూబ్‌నగర్ జిల్లా నుంచి విడదీయడం ఏకపక్ష నిర్ణయమన్నారు. ఈ సమావేశంలో పాలమూరు మున్సిపల్ చైర్‌పర్సన్ రాధా అమర్, డీసీసీ మాజీ అధ్యక్షుడు ముత్యాల ప్రకాశ్, ప్రధాన కార్యదర్శులు సత్తూరు చంద్రకుమార్‌గౌడ్, ధనుంజయరెడ్డి, మీడియాసెల్ కన్వీనర్ పటేల్ వెంకటేశ్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement