'ప్రజలారా కేసీఆర్ హామీలు నమ్మకండి' | dont belive in kcr: ponnam prabhakar, jeevanreddy | Sakshi
Sakshi News home page

'ప్రజలారా కేసీఆర్ హామీలు నమ్మకండి'

Aug 5 2015 3:24 PM | Updated on Sep 28 2018 7:36 PM

'ప్రజలారా కేసీఆర్ హామీలు నమ్మకండి' - Sakshi

'ప్రజలారా కేసీఆర్ హామీలు నమ్మకండి'

ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు, ఇచ్చే హామీలు గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు నమ్మకూడదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు.

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు, ఇచ్చే హామీలు గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు నమ్మకూడదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలోనే కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టేపనులు చేస్తున్నారని ఆరోపించారు.

కరీంనగర్ జిల్లా ప్రజలను కేసీఆర్ మోసం చేశారని, ఏడాది కిందట జిల్లా పర్యటనలో ఇచ్చిన 40 హామీల్లో నాలుగు కూడా అమలుకాలేదని విమర్శించారు. సీఎం హామీలన్నీ కూడా ప్రకటనలకే పరిమితమయ్యాయి తప్ప ఏ ఒక్కటి కూడా కార్యరూపం దాల్చడం లేదని అన్నారు. కరీంనగర్ జిల్లాకు ఇచ్చిన హామీల విషయంలో అమలుపై సీఎం కేసీఆర్ తప్పక స్పందించి తీరాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement