ప్రజలకు అందుబాటులో ఉండాలి | Doctors should always Ready toTreat the people | Sakshi
Sakshi News home page

ప్రజలకు అందుబాటులో ఉండాలి

Aug 11 2016 1:15 AM | Updated on Sep 4 2017 8:43 AM

సమావేశంలో మాట్లాడుతున్న  రంగయ్య

సమావేశంలో మాట్లాడుతున్న రంగయ్య

షాద్‌నగర్‌రూరల్‌: గ్రామీణ వైద్యులు ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటు ఉంటూ ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పించాలని దన్వంతరీ గ్రామీణవైద్యులసంఘం గౌరవఅధ్యక్షుడు రంగయ్య కోరారు.

షాద్‌నగర్‌రూరల్‌: గ్రామీణ వైద్యులు ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటు ఉంటూ ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పించాలని దన్వంతరీ గ్రామీణవైద్యులసంఘం గౌరవఅధ్యక్షుడు రంగయ్య కోరారు. బుధవారం పట్టణంలోని సీఎస్‌కె వెంచర్‌లోని సంఘం కార్యాలయంలో గ్రామీణవైద్యుల సమావేవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడువెంకటేష్‌ మాట్లాడుతూ గ్రామీణ వైద్యులు ఏ విధంగా వైద్యసేవలు అందించాలనే విషయమై సీనియర్‌ పబ్లిక్‌హెల్త్‌ ఆఫీసర్‌ సర్క్యూలర్‌ను అందించడం జరిగిందన్నారు. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, టీబీవంటి సీజనల్‌ వ్యాధులు పోకినప్పుడు ఎలాంటి జాగ్రత్తలను తీసుకోవాలనే విషయాలపై క్లుప్తంగా వివరించారు. ప్రథమిచికిత్స కేంద్రాలలో గ్రామీణవైద్యులు ప్రథమిచికిత్సను చేసిన తరువాత మొరుగైన వైద్యకోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాలన్నారు. పూర్థిస్థాయిలో శిక్షణ తీసుకున్న తరువాతనే ప్రజలకు వైద్యసేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో బూర్గుల ప్రాథమికకేంద్రం సిబ్బంది శ్రీశైలం, ఆరోగ్యమిత్ర అనంతయ్య, గ్రామీణవైద్యులు బాలకష్ణ, రంగయ్య, రవియాదవ్, తిరుపతియాదవ్, అంజమ్మ, మోతీలాల్, వెంకటేశ్వర్‌రెడ్డి, రాంపుల్లయ్య, అశోక్‌రెడ్డి, మారుతీగౌడ్, ఆచారి, లింగం, జాంగీర్‌ తదితరులు పాల్గొన్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement