నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణం సమీపంలోని ముత్తిరెడ్డిగూడెం గేటు వద్ద శుక్రవారం ఉదయం హైదరాబాద్ వైపు వెళ్లే అప్‌లైన్‌లో ఓ గూడ్స్ రైలు నిలిచిపోయింది.
నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణం సమీపంలోని ముత్తిరెడ్డిగూడెం గేటు వద్ద శుక్రవారం ఉదయం హైదరాబాద్ వైపు వెళ్లే అప్‌లైన్‌లో ఓ గూడ్స్ రైలు నిలిచిపోయింది. హెవీ లోడ్ కారణంగా సుమారు అరగంట సేపు ఆగిపోవడంతో పలు రైళ్ల రాకపోలకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. ఆలేరు మండలంలోని వంగపల్లి వద్ద 10.10 గంటల నుంచి 10.30 గంటల వరకు భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. ఆలేరు స్టేషన్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను సుమారు అరగంట సేపు నిలిపివేశారు. వేరే ఇంజన్‌ను తెప్పించి గూడ్స్ రైలును ముందుకు పంపించడంతో సమస్య తొలగిపోయింది.