వికలాంగుల వాయిస్‌ మాస పత్రిక ఆవిష్కరణ | 'disabled Voice' monthly magazine release | Sakshi
Sakshi News home page

వికలాంగుల వాయిస్‌ మాస పత్రిక ఆవిష్కరణ

Jul 18 2016 6:41 PM | Updated on Mar 28 2018 11:26 AM

వికలాంగుల వాయిస్‌ మాస పత్రిక ఆవిష్కరణ - Sakshi

వికలాంగుల వాయిస్‌ మాస పత్రిక ఆవిష్కరణ

వికలాంగులను ప్రత్యేక వ్యక్తులుగా గుర్తించి వారి సమస్యల పరిష్కారానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని తహసీల్దార్‌ విష్ణువర్ధన్‌రెడ్డి కోరారు.

ఘట్‌కేసర్‌ టౌన్‌: వికలాంగులను ప్రత్యేక వ్యక్తులుగా గుర్తించి వారి సమస్యల పరిష్కారానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని తహసీల్దార్‌ విష్ణువర్ధన్‌రెడ్డి కోరారు. మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యలయం ఆవరణలో సోమవారం 'వికలాంగుల వాయిస్‌' ప్రత్యేక మాస పత్రికను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వికలాంగులందరికీ అంత్యోదయ కార్డుల కోసం ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తానని చెప్పారు. అర్హులైన వారు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సీపీఎం డివిజన్‌ కార్యదర్శి చింతల యాదయ్య మాట్లాడుతూ.. పింఛన్‌లు తీసుకుంటున్న వారందరూ లైఫ్‌ సర్టిఫికెట్లు అందజేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరారు. ఉద్యోగాల్లో 3 శాతం రిజర్వేషన్లు, అంత్యోదయ కార్డులు, రెండు పడకల ఇళ్లను మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక డివిజన్‌ కార్యదర్శి చంద్రమోహన్, ఉపాధ్యక్షుడు శంకర్, దివ్యాంగులు రమేష్, రఘు, నర్సింహ్మ, జాని, పక్కీర్‌ పాల్గొన్నారు.

18ఎండిసీ33. దివ్యాంగుల వాయిస్‌ మాస పత్రికను ఆవిష్కరిస్తున్న తహసీల్దార్‌ విష్ణువర్థన్‌రెడ్డి, యాదయ్య తదితరులు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement