సమస్యలను పరిష్కరించండి సారూ.. | Dial your SP in Nellore | Sakshi
Sakshi News home page

సమస్యలను పరిష్కరించండి సారూ..

Sep 23 2016 1:50 AM | Updated on Oct 20 2018 6:19 PM

సమస్యలను పరిష్కరించండి సారూ.. - Sakshi

సమస్యలను పరిష్కరించండి సారూ..

నెల్లూరు(క్రైమ్‌): తమ సమస్యలను సత్వరమే పరిష్కరించి న్యాయం చేయాలంటూ పలువురు డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు

 
  •  డయల్‌ యువర్‌ ఎస్పీలో బాధితుల మొర
 
నెల్లూరు(క్రైమ్‌): తమ సమస్యలను సత్వరమే పరిష్కరించి న్యాయం చేయాలంటూ పలువురు డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఎస్పీ విశాల్‌గున్నీ అందుబాటులో లేకపోవడంతో గురువారం నెల్లూరు రూరల్, నగర డీఎస్పీలు డాక్టర్‌ తిరుమలేశ్వర్‌రెడ్డి, వెంకటరాముడు డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 
సమస్యలు..
  •  నగరంలో ట్రాఫిక్‌ పరిస్థితి దయనీయంగా ఉందని, ఆర్టిసీ బస్టాండ్‌ వద్ద పరిస్థితి అధ్వానంగా ఉందని నగరానికి చెందిన జిలానీ ఫిర్యాదు చేశారు. గంటల తరబడి ఆటోలను రోడ్లపై నిలిపేయడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగడంతో పాటు ఒక్కోసారి అంబులెన్స్‌లు సైతం ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నాయని చెప్పారు.
  • కోవూరుకు చెందిన కోటేశ్వరరావు తన ఇంట్లో 2012లో దొంగతనం జరిగిందని, ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఫిర్యాదు చేశారు.
  • నగరానికి చెందిన రాజేష్‌కుమార్‌ తన సెల్‌ఫోన్‌ చోరీ విషయాన్ని, కసుమూరుకు చెందిన ఓ వివాహిత తన కాపురాన్ని చక్కదిద్దాలని ఫిర్యాదు చేశారు. పరిశీలించి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఎస్‌బీ ఎస్సై శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement