శ్రీవారిని దర్శించుకున్న డీజీపీ | DGP, Lord Srinivasa, darsan | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న డీజీపీ

Sep 1 2016 11:11 PM | Updated on Sep 4 2017 11:52 AM

ఆలయం వద్ద శ్రీవారి బ్రహ్మోత్సవాలపై పోలీసు అధికారులతో మాట్లాడుతున్న డీజీపీ సాంబశివరావు

ఆలయం వద్ద శ్రీవారి బ్రహ్మోత్సవాలపై పోలీసు అధికారులతో మాట్లాడుతున్న డీజీపీ సాంబశివరావు

రాష్ట్ర డీజీపీ సాంబశివరావు గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

–తిరుమల బ్రహ్మోత్సవాలపై సమీక్ష
సాక్షి, తిరుమల : రాష్ట్ర డీజీపీ సాంబశివరావు గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తొలిసారిగా ఆలయానికి వచ్చారు. వేకువజాము తోమాల సేవ, ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆలయం వెలుపల తిరుపతి అర్బన్‌ ఎస్పీ జయలక్ష్మీ, ఇతర పోలీసు అధికారులతో కొంత సమయం బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై మాట్లాడి, పలు సూచనలు చేశారు. తర్వాత పోలీసు అతిధిగృహంలో ఆయన టీటీడీ విజిలెన్స్, పోలీసు అధికారులతో బ్రహోత్సావాలపై సమీక్షించారు. భద్రతాపరమైన విషయాలపై చర్చించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భద్రత కల్పించాలని సూచించారు. ఈ సారి బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement