
తిరుమలలో తొక్కిసలాట
చిత్తూరు జిల్లా తిరుమల పుణ్యక్షేత్రం లోని నందకం - అన్నప్రసాద కేంద్రం ద్వారం వద్ద శుక్రవారం సాయత్రం తొక్కిసలాట చోటు చేసుకుంది.
తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుమల పుణ్యక్షేత్రం లోని నందకం - అన్నప్రసాద కేంద్రం ద్వారం వద్ద శుక్రవారం సాయత్రం తొక్కిసలాట చోటు చేసుకుంది. గ్యాలరీలోకి వెళ్లే మార్గంలోని ప్రధాన గేటును తెరవడంతో భక్తులు ఒక్కసారిగా ముందుకు వచ్చారు. దీంతో కాస్త తొక్కిసలాట చోటుచేసుకుని పదిమంది గాయపడ్డారు.
వాస్తవానికి తిరుమలలో శుక్రవారం వైభవంగా గరుడసేవ జరుగుతుంది. గరుడసేవను తిలకించేందుకు దాదాపు 3లక్షలకు పైగా భక్తులు తరలివచ్చారు. రోప్‌వేతో ఎక్కడికక్కడ భక్తులను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. గేట్ల నుంచి ఒక్కసారిగి భక్తులు పరుగులు తీయడంతో కొందరు గాయపడ్డారు. అనంతరం గాయపడిన వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. టీటీడీ విచ్చలవిడిగా పాసులు జారీ చేయడమూ భక్తుల అసౌకర్యానికి కారణమని తెలుస్తోంది.