అర్ధరాత్రి నుంచే అమ్మసన్నిధికి.. | devotees came mid night for durgamma darshan | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి నుంచే అమ్మసన్నిధికి..

Oct 8 2016 9:31 PM | Updated on Sep 4 2017 4:40 PM

అర్ధరాత్రి నుంచే అమ్మసన్నిధికి..

అర్ధరాత్రి నుంచే అమ్మసన్నిధికి..

సకల విద్యలకు అధిష్టాన దేవత అయిన సరస్వతీదేవి అవతారంలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు.

సకల విద్యలకు అధిష్టాన దేవత అయిన సరస్వతీదేవి అవతారంలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. రాత్రి 12 గంటల సమయంలో దుర్గగుడి పరిసర ప్రాంతాలు భక్తులతో రద్దీగా మారాయి. అర్ధరాత్రి 12.30 గంటలకు సుప్రభాత సేవతో ఆలయంలో అర్చకస్వాములు వైదిక కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం శనివారం తెల్లవారుజామున 1.10 గంటలకు అమ్మవారికి ప్రత్యేక హారతులిచ్చి తలుపులు తెరిచారు. తొలుత ఈవో సూర్యకుమారి దంపతులు పూజలు నిర్వహించారు. అనంతరం ఇతర ప్రముఖులను అంతరాలయంలోకి అనుమతించారు. ఆ తర్వాత సాధారణ భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిచ్చారు.  – విజయవాడ (వన్‌టౌన్‌) 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement