రాష్ట్రంలో రాక్షస పాలన
టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. ఈ పాలనకు చరమగీతం పాడేందుకు పార్టీ శ్రేణులు, ప్రజలు కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. మంగళవారం నగరంలోని గొంగటి రామప్ప ఫంక‌్షన్ హాలులో అనంతపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ప్లీనరీ జరిగింది. పార్టీ నగర అధ్యక్షులు రంగంపేట గోపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ...
-
అవినీతి ప్రదేశ్‌గా మార్చారు
-
ఐకమత్యంతో పని చేసి వచ్చే ఎన్నికల్లో పార్టీ జెండా ఎగురవేద్దాం
-
‘అనంత’ ప్లీనరీలో వైఎస్సార్‌సీపీ నేతల పిలుపు
అనంతపురం :
టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. ఈ పాలనకు చరమగీతం పాడేందుకు పార్టీ శ్రేణులు, ప్రజలు కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. మంగళవారం నగరంలోని గొంగటి రామప్ప ఫంక‌్షన్ హాలులో అనంతపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ప్లీనరీ జరిగింది. పార్టీ నగర అధ్యక్షులు రంగంపేట గోపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి మాట్లాడారు.
ప్రజల కోసం వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అలుపెరుగని పోరాటాలు చేస్తున్నారన్నారు. విలువలు, విశ్వసనీయత అనేది వైఎస్ కుటుంబం నుంచే నేర్చుకున్నామన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. ఓడిపోయినంత మాత్రాన తాము జేసీ దివాకర్‌రెడ్డిలాగా ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోలేదన్నారు. నియోజకవర్గంలోనే ఉన్నామని, విలువలు, విశ్వసనీయతతో రాజకీయాల్లో ఉన్నంత కాలమూ ప్రజలు ఆదరిస్తారని అన్నారు. నాయకులంతా సమష్టిగా పని చేస్తే వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని రెండు ఎంపీలతో పాటు 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందన్నారు. కార్యక్రమంలో గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి, నాయకులు గిర్రాజు నగేష్, అనంత చంద్రారెడ్డి, పామిడి వీరాంజనేయులు, మీసాల రంగన్న, మునిరత్నం శీనా తదితరులు పాల్గొన్నారు.
ఆధిపత్యం కోసం మూడు స్తంభాలాట – మాజీ ఎంపీ అనంత
నగరంలో ఆధిపత్యం కోసం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూప మూడు స్తంభాలాట ఆడుతున్నారు. నగర అభివృద్ధిని పక్కన పెట్టి కమీషన్ల కోసం పాకులాడుతున్నారు. ఎమ్మెల్యే చౌదరి మూడు లక్షల మొక్కలు నాటామని చెబుతున్నారు. అవి ఎక్కడ పెరిగి చెట్లు అయ్యాయో చెప్పాలి. నగరాన్ని మురికికూపంగా మార్చేశారు. పైపులైను పనుల్లో ప్రజాధనం దోపిడీ చేశారు. మరో 30 ఏళ్లు నగరానికి నీటి సమస్య లేకుండా దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పీఏబీఆర్ పథకాన్ని తీసుకొచ్చాం. ఇందిరమ్మ పాలనను వైఎస్ మరిపించారు. అలాంటి పాలన మళీ రావాలంటే వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. ఆయనపై ప్రజల్లో నమ్మకం ఉంది.
మూర్ఖత్వంతో వెళ్తున్నారు – ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి
చంద్రబాబు మూర్ఖత్వంతో ముందుకు వెళ్తున్నారు. ప్రత్యేక హోదాను ఢిల్లీలో తాకట్టు పెట్టారు. రాష్ట్రంలో విద్య,వైద్యం నిర్వీర్యమయ్యాయి. రాయలసీమలో విపరీతమైన కరువు ఉంది. ఉపాధి లేక ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. అయినా ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
జెండాను రెపరెపలాడించాలి – వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు శంకరనారాయణ
2019 ఎన్నికల్లో జిల్లాలో వైఎస్సార్‌సీపీ జెండాను రెపరెపలాడించాలి. ఇందులో భాగంగా సంస్థాగతంగా బలోపేతం కావాలి. పార్టీ శ్రేణులపై అధికార పార్టీ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఎవరూ ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. టీడీపీ నేతలు సొంత డబ్బా కొట్టుకునేందుకే మహానాడు నిర్వహించారు తప్ప ప్రజా సమస్యలపై చర్చించడానికి కాదు.
అవినీతి ప్రదేశ్‌గా మార్చారు – కాపు రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ప్లీనరీ పరిశీలకులు
చంద్రబాబు వందలాది అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ను అవినీతి ప్రదేశ్‌గా మార్చారు. అత్యంత అవినీతి రాష్ట్రంగా ఏపీని ఒక సంస్థ గుర్తించిందంటే చంద్రబాబు పాలన ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ కాదది.. తెలుగు ద్రోహం పార్టీ. మాట తప్పని, మడమ తిప్పని నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. విలువలు, విశ్వసనీయతకు ఆయన పెద్దపీట వేస్తారు.