ప్రజాస్వామ్యం ఖూనీ | democracy killed | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యం ఖూనీ

Apr 3 2017 10:58 PM | Updated on Aug 10 2018 8:23 PM

ప్రజాస్వామ్యం ఖూనీ - Sakshi

ప్రజాస్వామ్యం ఖూనీ

రాజ్యాంగానికి విరుద్ధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చి ప్రజాసా​‍్వమ్యాన్ని ఖూనీ చేశారని ఎమ్మెల్సీ గంగుల ప్రతాప్‌రెడ్డి మండిపడ్డారు.

 – పార్టీ ఫిరాయించిన వారికి మంత్రి పదవులా ? 
 - దమ్ముంటే రాజీనామ చేయించి గెలిపించుకోవాలి 
- ముఖ్యమంత్రి చంద్రబాబుకు  ఎమ్మెల్సీ గంగుల సవాల్‌
 
ఆళ్లగడ్డ : రాజ్యాంగానికి విరుద్ధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చి ప్రజాసా​‍్వమ్యాన్ని ఖూనీ చేశారని ఎమ్మెల్సీ గంగుల ప్రతాప్‌రెడ్డి మండిపడ్డారు.నోరు తెరిస్తే  తాను నిప్పునని... నిజాయితీపరుడినని చెప్పుకునే బాబు ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తారని విమర్శించారు.  ప్రతిపక్ష పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను సంతలో పశువులా కొనుగోలు చేసి  ప్రజా స్వామ్యాని​‍్న పాతరేశారని చెప్పారు.  స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడుతూ నాడు  టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన తలసానికి మంత్రిగా ప్రమాణం చేయించిన గవర్నర్‌ పై, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై  చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారన్నారు. మరి ఇప్పుడు ఆయన ఏపీలో చేసింది అలాంటి తప్పుడు పనే కదా అని ప్రశ్నించారు. బాబు  నీచ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.  దమ్ముంటే ఇప్పటికైనా జంపు జిలానీలతో రాజీనామ చేయించి గెలిపించుకోవాలని సవాల్‌ విసిరారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement