కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ డిగ్రీ విద్యార్థి పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కందుకూరు: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ డిగ్రీ విద్యార్థి పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కందుకూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేదునూరుకు చెందిన కంచెర్ల వెంకటయ్య చిన్న కుమారుడు ప్రభాకర్, అలియాస్ పవన్(20) హైదరాబాద్ సిటీ కళాశాలలో బీకాం చివరి సంవత్సరం చదువుతున్నాడు.
పొరుగింట్లో ఉండే బాబాయ్ కుటుంబంతో కలహాలు తలెత్తడంతో మనస్తాపానికి గురైన అతడు మంగళవారం సాయంత్రం పురుగులమందు తాగి నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. పోలీసులు ప్రభాకర్‌ను చికిత్స నిమిత్తం 108వాహనంలో ఉస్మానియా ఆస్సత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అదేరోజు రాత్రి 11 గంటల సమయంలో అతడు మృతి చెందాడు. ఈమేరకు సీఐ విజయ్‌కుమార్ బుధవారం కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించారు.