పెళ్లైన 22 రోజులకే పరలోకాలకు.. | death after married 22 days | Sakshi
Sakshi News home page

పెళ్లైన 22 రోజులకే పరలోకాలకు..

Feb 22 2017 11:01 PM | Updated on Mar 28 2019 6:18 PM

పెళ్లైన 22 రోజులకే పరలోకాలకు.. - Sakshi

పెళ్లైన 22 రోజులకే పరలోకాలకు..

పామిడిలోని 44వ నంబరు జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురిలో ఒకరైన జేఎన్‌టీయూ వీసీ ఎంఎంఎం సర్కార్‌ కారు డ్రైవర్‌ నాగప్రసాద్‌ (30) జీవితం విషాదాంతమైంది.

పామిడి (గుంతకల్లు) : పామిడిలోని 44వ నంబరు జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురిలో ఒకరైన జేఎన్‌టీయూ వీసీ ఎంఎంఎం సర్కార్‌ కారు డ్రైవర్‌ నాగప్రసాద్‌ (30) జీవితం విషాదాంతమైంది. ఈయనకు ఈ నెల ఒకటో తేదీన తూర్పుగోదావరి జిల్లా బండారులంక గ్రామానికి చెందిన నాగదేవితో వివాహమైంది. తిరుగింపులో భాగంగా అత్తగారి ఊరికెళ్లిన నాగప్రసాద్‌ విధి నిర్వహణలో భాగంగా భార్యను పుట్టింటిలోనే వదిలి ఇటీవలే అనంతపురం రావాల్సి వచ్చింది. పెళ్లయిన 22 రోజులకే నాగప్రసాద్‌ రోడ్డుప్రమాదంలో మృత్యువాత పడటం చూసి స్నేహితులు కంటతడి పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement